రియల్​మీ నుంచి పీ3 అల్ట్రా, పీ3 5జీ ఫోన్లు.. రేటెంతంటే..

రియల్​మీ నుంచి పీ3 అల్ట్రా, పీ3 5జీ ఫోన్లు.. రేటెంతంటే..

రియల్‌మీ తాజాగా రియల్మీ పీ3 అల్ట్రా, పీ3 5జీ అనే రెండు స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను ఇండియా మార్కెట్లలోకి తీసుకొచ్చింది. పీ3 అల్ట్రాలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌‌‌‌, 6000 ఎంఏహెచ్​ టైటాన్ బ్యాటరీ, 50 ఎంపీ మెయిన్​ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ధరలు రూ.24 వేల నుంచి మొదలవుతాయి. పీ3 ఫోన్​లో స్నాప్‌‌‌‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌‌‌‌, 6.7-అంగుళాల డిస్​ప్లే, 50 ఎంపీ మెయిన్ ​కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ధరలు రూ.17 వేల నుంచి మొదలవుతాయి.