రియల్ మీ తన కొత్త ఫోన్లను విడుదల చేయబోతోంది. రియల్ మీ X , రియల్ మీ X యూత్ ఎడిషన్ అనే ఫోన్లను ఈ నెల 15 న చైనాలో విడుదల చేయబోతుంది. చైనా రెగ్యులేటర్ TENAA వెబ్ సైట్ ఈ ఫోన్లకు సంబంధించిన విశేషాలను, స్పెసిఫికేషన్లను వెల్లడించింది. రియల్ మీ X 48-మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ ను కలిగి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. ఈ మధ్యకాలంలో వచ్చిన దాదాపు అన్ని ఫోన్లలో సెన్సార్ చాలా పాపులర్ అయింది. ఇదే బేస్ చేసుకొని తమ కంపెనీ రూపొందించిన ఈ ఫోన్ 6.5 అంగుళాల పొడువు, డిస్ ప్లే పై ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,680 mAh బ్యాటరీ ఉంటుందని తెలిపింది. అదే విధంగా రియల్ మీ X యూత్ ఎడిషన్, 6.3-అంగుళాల పొడువు, 6 GB RAM అని తెలిపింది.
రియల్ మీ X స్పెసిఫికేషన్ (అంచనా)
అండ్రాయిడ్ పై OS 6.0,
6.5 ఇంచెస్ స్క్రీన్
ఫుల్ హెచ్ డి (1080×2340 పిక్సెల్స్) AMOLED డిస్ ప్లే
మోడల్ నంబర్ RMX1901
ఆక్టా కోర్ ప్రాసెసర్ 2.2GHz
4GB RAM.
ఇంటర్నెల్ స్టోరేజీ 64GB
Realme X 48-మెగాపిక్సెల్ మరియు 5-మెగాపిక్సెల్ రేర్ సెన్సార్లను మరియు 16-మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ సెన్సర్ ను కలిగి ఉంటుందని TENAA తెలిపింది. ఇది బ్లాక్-బ్లూ, మరియు వైట్ రంగు ఎంపికలు చైనాలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. 3,680mAh బ్యాటరీతో మార్కెట్ లో లభ్యం కానుంది.
రియల్ మీ X యూత్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
ఈ ఫోన్ మోడల్ నంబర్ RMX1851
సైజు 6.3-అంగుళాలు
ఫుల్ హెచ్ డి (1080×2340 పిక్సెల్స్) IPS LCD డిస్ ప్లే
4GB RAM + 64GB స్టోరేజ్ మరియు 6GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
Realme X యూత్ ఎడిషన్ 16-మెగాపిక్సెల్ మరియు 5-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మరియు 25-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.