మీరు Realme స్మార్ట్ ఫోన్లను ఇష్టపడతారా.. కొత్త ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్.. Realme తన రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత్ లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. Realme12 Pro, Realme Pro + కొత్త ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్లు జనవరి 29న ప్రారంభించబడతాయి. ఇవి ఫ్లిప్ కార్ట్, Realme అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ లాంచ్ కు ముందే పలు ఫీచర్లు వెల్లడయ్యాయి. టెలిఫోటో సెన్సార్ ను కలిగి ఉన్న రియల్ మీ మొదటి ఫోన్ ఇదే. రెండు మోడల్స్ 5G సపోర్ట్ తో వస్తాయిని అంచనా.
Realme 12 Pro, Realme 12 Pro + స్మార్ట్ ఫోన్లు BIS సర్టిఫికేషన్ ప్లాట్ ఫారమ్ లో కనిపించాయి. Realme 12 Pro పెద్ద కెమెరా అప్ గ్రేడ్ నుపొందుతుందని అంచనా. ఇది మంచి ఫొటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ షూటర్ కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది.
Realme 12 Pro సిరీస్ లో 6.7 అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్ ప్లే 2412x1080 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ , సెల్పీ కెమెరా కోసం చంచ్ హోల్ కటౌట్ ను కలిగి ఉంటుందని అంచనా. ఈ ఫోన్లు 16GB RAM, 1TB వరకు స్టోరేజ్ ని కలిగిం ఉంటుంది.
రెండు కెమెరాలు అనేక ఫీచర్లు
Realme 12 Pro+ లో 50 మెగా పిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరా, 64 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ , 8 మెగా పిక్సెల్ కెమెరా ఉండవచ్చ. ఈ ఫోన్ సెల్ఫీ కసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
అయితే Realme 12 Pro లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెన్సార్ ఉండవచ్చు. ఈ ఫోన్ సెల్పీకోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ను కలిగి ఉంటుంది. రాబోయే ఈ రెండు ఫోన్లు Redme నోట్ 13 సిరీస్ కు గట్టి పోటీని ఇస్తాయని భావిస్తున్నారు.