సినీ ఫ‌క్కీలో రియల్టర్‌ ను నరికి చంపిన దుండగులు

హైదరాబాద్ శివారు ప్రాంతం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మే 11వ తేదీ గురువారం సాయంత్రం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియన వ్యక్తులు నరికి చంపారు. రాంపల్లి ఆర్టీసీ కాలనీకి చెందిన అశోక్ (45)..తన ఇంటి దగ్గర ఉండగా కారులో నలుగురు దుండగులు వచ్చి మారణాయుధాలతో దాడి చేశారు. అశోక్‌పై దాడి జరగడం గమనించిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. 

వెంటనే స్థానికులు అశోక్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘనటపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు వచ్చిన కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం పలు అనుమానాలకు తావ్విస్తోంది.

కాగా, గత రెండు సంవత్సరాల క్రీతం కూడా మృతుడు అశోక్ పై హత్యా ప్రయత్నం జరిగింది. పాత కక్షలే ఈ హత్యకు కారణం అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన బుగ్గ విజయ్ కుమార్ గా హత్య చేసిన వారిలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.