భూతగాదాలతో ‘ఖని’లో రియల్టర్ హత్య

గోదావరిఖని/జ్యోతినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : భూతగాదాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సమీపంలోని ఖాజిపల్లి గ్రామానికి చెందిన మేకల లింగయ్య (48)ను సమీప బంధువులు సోమవారం రాత్రి వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు. రామగుండం సీఐ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్టీపీసీ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కథనం ప్రకారం.. ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన మేకల లింగయ్య రియల్​ఎస్టేట్​ వ్యాపారి. ఈయనకు బంధువైన(దాయాది) మేకల కుమారస్వామి చిట్టీల బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు.

Also Raed : బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

చాలా మందికి డబ్బులు చెల్లించలేకపోవడంతో బాధితులు పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా తన భూమి అమ్మి డబ్బులు చెల్లిస్తానని వారికి మాటిచ్చాడు. ఆ భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తే మేకల లింగయ్య పలుమార్లు అడ్డుతగిలాడు. 

కొన్ని రోజుల నుంచి వీరి మధ్య ఈ భూమికి సంబంధించిన వివాదం నడుస్తుండడంతో లింగయ్యను అడ్డుతొలగించుకోవాలని కుమారస్వామి ప్లాన్​వేశాడు. కొంతమందితో కలిసి సోమవారం రాత్రి 9 గంటలకు తన ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న లింగయ్యపై  వేట కొడవళ్లతో దాడి చేశాడు. దీంతో లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. లింగయ్య కూతురు సుప్రజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేకల కుమారస్వామి, మేకల సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేకల మల్లమ్మ, అనుచరుడు దొబ్బల మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర్మారపు అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో గోదావరిఖనిలోని ఓ కాలనీకి చెందిన ఇద్దరు కిరాయి హంతకులు కీలకంగా వ్యవహరించినట్టు ప్రచారం జరుగుతోంది. హత్యకు ఉపయోగించిన మూడు కొడవళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.