
న్యూఢిల్లీ: ఇండియాలోని రియల్టీ కంపెనీలు 2022 – 2024 మధ్య రూ.90,057 కోట్ల విలువైన 5,885 ఎకరాల ల్యాండ్‌ను కొనుగోలు చేశాయి. జేఎల్‌ఎల్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, 2022 లో 1,603 ఎకరాల ల్యాండ్‌ను రూ.18,112 కోట్లకు, 2023 లో 1,947 ఎకరాల ల్యాండ్‌ను రూ.32,203 కోట్లకు, 2024 లో 2,335 ఎకరాల ల్యాండ్‌ను రూ.39,742 కోట్లకు కొనుగోలు చేశాయి.