వైఎస్ విజయమ్మ జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీకి కారణం ఇదేనా..

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ విజయమ్మ, జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. విజయమ్మ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, అదే సమయంలో అక్కడికి వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా పలకరించి మాట్లాడారని,ఈ భేటీ వెనక రాజకీయ కారణాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఖండిస్తున్నారు వైసీపీ శ్రేణులు. వైఎస్ మరణం తర్వాత నుండి 2019 ఎన్నికల వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న విజయమ్మ ఆ తర్వాత వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకొని రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.