ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ కుల్దీప్ మెహతా ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. అయితే అనిల్ మెహతా కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. దీంతో చికిత్స తీసుకుంటూ మెడిసిన్స్ వాడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలతో విసిగిపోయిన అనిల్ కుల్దీప్ మెహతా సెప్టెంబర్ 11వ తారీఖున తన నివాసంలోని 6వ అంతస్థు బాల్కనీ నుండి దూకి మరణించాడు.
అయితే పోలీసులు అనిల్ మెహతా ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మలైకా అరోరా మరియు అమృతా అరోరాలకు చివరగా చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ కాల్ సంభాషణలో అనిల్ మెహతా "తాను అనారోగ్యం సమస్యలతో అలసిపోయానని" చెప్పి ఫోన్ కట్ చేశారని ఆ తర్వాత ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
దీంతో పోలీసులు అనిల్ మెహతా కి వైద్యం చేస్తున్న డాక్టర్ల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చెయ్యాలని భావిస్తున్నారు.అలాగే ఘటనా స్థలంలోని పరిసరాల్ని, సీసీ కెమెరాలని కూడా పరిశీలించారు.