Ravichandran Ashwin: అశ్విన్ షాకింగ్ రిటైర్మెంట్.. ఆ విషయాన్ని ముందుగానే గ్రహించాడా

Ravichandran Ashwin: అశ్విన్ షాకింగ్ రిటైర్మెంట్.. ఆ విషయాన్ని ముందుగానే గ్రహించాడా

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయంతో బిగ్ షాక్ ఇచ్చాడు. ఫామ్ లో ఉన్న ఈ ఆఫ్ స్పిన్నర్ సడన్ గా ఎందుకు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడనే విషయం సస్పెన్స్ గానే ఉంది. బ్రిస్బేన్‌లో బుధవారం( డిసెంబర్ 18)  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పక్కనే ఉన్న కోహ్లీని హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు.   

క్రికెట్ లో అశ్విన్ కు చాలా తెలివైనవాడని పేరుంది. అతన్ని క్రికెట్ లో సైన్టిస్ట్ తో పోలుస్తారు. ఫామ్ లో ఉన్న అశ్విన్ గుడ్ బై చెప్పడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం భారత క్రికెట్ యంగ్ ప్లేయర్లపై ద్రుష్టి పెడుతుంది. సీనియర్లను పక్కన పెట్టే ఆలోచనలో ఉంది. పుజారా, రహానే దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న వారిని సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. యువ ఆటగాళ్లను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో సీనియర్లకు చెక్ పెడుతున్నారు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్, కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. 

ఈ విషయాన్ని అశ్విన్ ముందుగానే గ్రహించినట్టు ఉన్నాడు. తనను జట్టులో నుంచి సెలక్టర్లు తీసివేయకుండా ముందుగానే తప్పుకోవడం బెటర్ అని భావించి ఉన్నాడు. ప్రస్తుతం అశ్విన్ టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఒకవేళ విదేశీ పర్యటన అయితే అతనికి జట్టులో స్థానం దక్కడం లేదు. స్వదేశంలో రెగ్యులర్ గా ఆడుతున్నా కుల్దీప్ యాదవ్, సుందర్, జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్లు అశ్విన్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఒకవేళ అశ్విన్ ఏదైనా సిరీస్ లో విఫలమైతే అతన్ని టెస్ట్ జట్టులో వేటు తప్పదు. 

అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 వికెట్లు.. 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్ లో అశ్విన్ ఆడతాడు. అతను 2025 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.