టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రహం "అనగనగా ఒకరాజు". ఈ సినిమాకి మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన గ్లింప్స్ రిలీజ్ కాగా మంచి స్పందన లభించింది.
ఈ గ్లింప్స్ లో ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి ముఖేష్ అంబానీతో కన్వర్సేషన్, అలాగే తినే ప్లేటుతోపాటూ స్వీట్ కూడా గోల్డ్ అంటూ అబ్బో ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. దీంతో నవీన్ పోలిశెట్టి మరోసారి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ కి అలరించడానికి సిద్దమవుతున్నాడు.
అయితే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జంటగా ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం మరో కన్నడ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల ని తెసుకోవాలని అనుకున్నారు. దీంతో మొదట్లో స్టోరీ విన్న శ్రీలీల కూడా ఒకే చెప్పిందట.
కానీ అనుకోకుండా చివరి నిమిషంలో డేట్లు సర్ధుబాటు కాకపోవడం, పవన్ కళ్యాణ్, తమిళ్ హీరో శివ కార్తికేయన్ తదితర స్టార్ హీరోలతో నటించే ఆఫర్లు రావడంతో అనగనగా ఒక రాజు సినిమాకి నో చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజెంట్ టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో ఫామ్ లో ఉన్న మీనాక్షి చౌదరిని లాస్ట్ మూమెంట్ లో ఖాయం చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం శ్రీలీల మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉంది. అంతేకాదు సౌత్ లో తెలుగుతోపాటూ తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషల్లో హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
ALSO READ | స్టార్ హీరో క్యాన్సర్ సర్జరీ విజయవంతం.. థాంక్స్ అంటూ కూతురు ట్వీట్..
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీలీల తెలుగులో ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుములు దర్శకత్వం వహిస్తున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. ఇప్పటికే రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ పూర్తయింది. దీంతో క్రిస్మస్ పండగకి రిలీజ్ కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలవల్ల రిలీజ్ వాయిదా పడింది.
ఇక శ్రీలీల అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఎస్.కే25 లో కూడా హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం.