
కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బంధం విడదీయలేనిది. నాలుగేళ్లుగా కేకేఆర్ జట్టు ప్లేయింగ్ 11 ఉన్న ఏకైక ఆటగాడు. జట్టులో ఎవరు వచ్చి వెళ్లినా నరైన్ మాత్రం కామన్ గా ఉంటాడు. అయితే నాలుగేళ్ల తర్వాత నరైన్ ఐపీఎల్ మ్యాచ్ మిస్ అవ్వాల్సి వచ్చింది. గౌహతి వేదికగా బుధవారం (మార్చి 26) రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో నరైన్ ప్లేయింగ్ 11 లో లేకపోవడం షాకింగ్ కు గురి చేసింది.
టాస్ గెలిచిన తర్వాత కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే నరైన్ స్థానంలో మొయిన్ అలీ తుది జట్టులోకి వస్తున్నాడని చెప్పాడు. నరైన్ కు అనారోగ్యం అని అందుకే అతను ఈ మ్యాచ్ లో ఆడడం లేదని తెలిపాడు. దీంతో 1435 రోజుల తర్వాత నరైన్ ఐపీఎల్ మ్యాచ్ మిస్ అయ్యాడు. చివరిసారిగా నరైన్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మ్యాచ్ మిస్ అయ్యాడు. నరైన్ లేకపోయినా అతని స్థానంలో వచ్చిన మొయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 23 పరుగులిచ్చి జైశ్వాల్, నితీష్ రానా వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటింగ్ లో విఫలమైంది. కేకేఆర్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ స్పిన్ మాయాజాలం చూపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. 33 పరుగులు చేసి ధృవ్ జురెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రానా తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్పెన్సర్ జాన్సెన్ కు ఒక వికెట్ దక్కింది.
Sunil Narine last missed an IPL game was in 2021 against RCB.
— Cricket.com (@weRcricket) March 26, 2025
Will KKR miss Narine the batter or bowler more against RR today? pic.twitter.com/PeKjxcYL41