ఫోన్ అడిక్షన్ అవడానికి కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం ఫోన్ చూస్తుంటారు. ఆ అప్డేట్స్ను కొన్ని గంటల తర్వాత చూసినా పోయేదేం లేదనే విషయం అర్థం చేసుకుంటే ఆటోమెటిక్‌గా ఫోన్ వాడకం తగ్గిపోతుంది. అంటే సోషల్ మీడియా వాడకాన్ని నెమ్మదిగా తగ్గించాలి.
- ఫోన్లో నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి మొబైల్ చూసే అలవాటు ఉంటుంది ఎక్కువమందికి. దాంతో ఫోన్ వాడకం ఎక్కువైపోతుంది. కాబట్టి ఫోన్లోని యాప్స్‌కు నోటిఫికేషన్ ఆఫ్ చేయాలి.
- రోజూ ఫోన్‌ను ఎంతసేపు వాడుతున్నారో? ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సెల్‌ఫోన్ వాడే టైంను మెల్లగా తగ్గించాలి.
- ఫోన్లో అలారం పెట్టుకోకుండా వేరే డివైజ్‌లో పెట్టుకోవాలి.
- ఫేస్ బుక్, వాట్సాప్ సహా కొన్ని సోషల్ మీడియా యాప్స్, ఇ–మెయిల్ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి రోజులో ఏదో ఒక టైం పెట్టుకోవాలి.
- వీలుంటే ప్రతి రోజు కొన్ని గంటలపాటు ఫోన్‌ని పక్కన పెట్టాలి. ఫోన్ వాడకం తగ్గించేందుకు మరో టెక్నిక్ ఇంటర్నెట్ ఆపేయడం.
- ఫోన్ ఛార్జింగ్ దూరంగా పెట్టుకోవాలి. అలాకాకుండా కూర్చున్న లేదా పడుకున్న దగ్గర ఫోన్ ఛార్జింగ్ పెడితే మాటిమాటికీ తీస్తుంటారు.
- ఫోన్ వాడకుండా ఎంత టైం ఉండగలను’’ అని డిసైడ్ చేసుకుని. అంతసేపు ఫోన్ వాడకుండా ఉండాలి.