బస్సుల్లో సీట్లు బ్లూ కలర్ లోనే ఎందుకు ఉంటాయి..?

బస్సుల్లో సీట్లు బ్లూ కలర్ లోనే ఎందుకు ఉంటాయి..?

బస్ సీటు రంగు ముదురు రంగులో ఉండటమే కాకుండా రంగు మరింత ముదురు రంగులో కనిపించేలా దీని డిజైన్ ఉంటుంది. అయితే దీని వెనుక అసలు కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముదురు రంగు మాత్రమే కాదు, దానిపై గ్రాఫిక్ డిజైన్లను ఎందుకు తయారు చేస్తారో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. . . 

పూర్వకాలం ప్రయాణం చేయాలంటే వారి కష్టాలు అంతా ఇంతా... ఎక్కడికి వెళ్లాన్నా కాలినడకన వెళ్లేవారు.  కొంతకాలం తరువాత ఎడ్ల బండ్లపై వెళ్లేవారు.  ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ది చెందిన కొలదీ.. బస్సులు.. రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్నాము.  అయితే దాదాపుగా ఎందులో చూసిన కూర్చొనే సీట్లు బ్లూ కలర్ లో ఉంటాయి.  ఇది అంత పెద్ద విషయం కాకపోయినా ప్రస్తుతం ఆ రంగు సీట్ల గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ✦ ???? (@_likealeaf)

ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయడంలో ప్రజా రవాణా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో రైళ్లు, బస్సులను ముఖ్యంగా చెప్పుకోవాలి. తక్కువ దూరాలకు ఎక్కువ మంది బస్సులను ఉపయోగిస్తారు. అయితే బస్సులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి మీకు తెలుసా? నిజానికి, మీరు ఏ బస్సులో ప్రయాణించినా, మీకు ఒక సాధారణ విషయం కనిపిస్తుంది. ఈ విషయం బస్ సీటు రంగు. ఏ బస్సులో సీట్లు చూసినా అవి ఎప్పుడూ ముదురు రంగులోనే ఉంటాయి.

బస్ సీట్లు ఎందుకు ముదురు రంగులో ఉంటాయి?

బస్ సీటు రంగు ముదురు రంగులో ఉండటమే కాకుండా రంగు మరింత ముదురు రంగులో కనిపించేలా దీని డిజైన్ ఉంటుంది. అయితే దీని వెనుక అసలు కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముదురు రంగు మాత్రమే కాదు, దానిపై గ్రాఫిక్ డిజైన్లను ఎందుకు తయారు చేస్తారు? తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో బస్ సీట్ల రంగు ఎందుకు చీకటిగా ఉంచబడుతుందో వివరించారు. వీడియోలో.. బస్ సీటును తాకగానే ఆ సీటులో పేరుకుపోయిన దుమ్ము ఒక్కసారిగా గుప్పుమంటూ పైకి లేచింది. బస్ సీట్లు ఎంత మురికిగా ఉన్నాయో దీన్నిబట్టి తెలుస్తోంది.

వీడియో చూసిన వినియోగదారుల రియాక్షన్

రోజూ వేలాది మంది బస్సులో ప్రయాణిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో సీట్లు మురికిగా ఉండటం సహజం. అందుకే బస్ సీటు రంగు తేలికగా ఉంటే అందులో ధూళి సులభంగా కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బస్సుల సీట్లు ముదురు రంగులో ఉంటాయని అంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. బస్సు సీటు ఇంత మురికిగా ఎలా మారిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.