Prabhas: డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..? ఆలోచింపజేస్తున్న ప్రభాస్ అవగాహన వీడియో

Prabhas: డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..? ఆలోచింపజేస్తున్న ప్రభాస్ అవగాహన వీడియో

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) అవగాహన వీడియో ఇపుడు ఆలోచింపజేస్తుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన సందేశం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

"లైఫ్ లో మనకి బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి.. కావలసినంత వినోదం ఉంది.. మనల్ని ప్రేమించే మనుషులు.. మన కోసం బ్రతికే మనవాళ్ళు మనకి ఉన్నప్పుడు.. ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?.. ఈరోజు నుండి డ్రగ్స్ కి గుడ్ బై చెప్పండి.. మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ కి బానిసలైతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగలరు"అంటూ ప్రభాస్ తెలిపారు.

అయితే, డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ మహా కార్యంలో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ తమ సందేశాలను వీడియోల ద్వారా తెలుపుతున్నారు. అయితే, మరికొన్ని గంటల్లో 2024కు ఎండ్‌ కార్డ్‌ పడనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరిలో ఉత్సాహం మొదలైంది.

ALSO READ | SreeLeela: వ్యూస్, లైక్స్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి

ఈ క్రమంలో ప్రభుత్వం, పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకంటే, తాగి నడుపుతూ ప్రమాదాలు, డ్రగ్స్ తీసుకుని అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. కనుకే, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, నడుచుకోవాలని జాగ్రత్త చెబుతూ.. హెచ్చరిస్తున్నారు.