పెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు

సోషల్ మీడియా సాక్షిగా పెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు బహిర్గతమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డిపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చాటింగ్ ద్వారా తెలుస్తోంది. మున్సిపాలిటీలో కోటి రూపాయలకుపైగా కుంభకోణం జరిగినట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. 50శాతం రుజువు చేయడానికి ఏ వేదికైనా రెడీ అంటూ కొందరు కౌన్సిలర్లు వాట్సాప్ లో పోస్టులు చేశారు. కౌన్సిలర్లకు బదులు రోబోలను పెట్టి గెలిపించుకుంటే అయిపోయేది కదా.. అంటూ కామెంట్స్ చేశారు. 

పెద్దపల్లి పట్టణంలో ఏం జరుగుతుందో తమకు తెలియజేయడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఆయన కోడలు మున్సిపల్ చైర్ పర్సన్  మమతారెడ్డి, అధికారులు ఒకచోట కూర్చొని... బిల్లులు ఆమోదించుకోవచ్చు కదా అంటూ వాట్సాప్ గ్రూప్ లో పోస్టులు పెట్టారు. గతంలో మున్సిపల్ చైర్ పర్సన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.