వాట్సాప్ గ్రూపుల్లో రెండు మూడు రోజుల నుంచి ఓ మెసేజ్ హల్ చల్ చేస్తుంది.
ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ
గూగుల్ పే వినియోగదారులకు ఇది శుభవార్త
స్క్రాచ్ కార్డ్ ను రూ.500 నుండి 5వేల వరకు పొందండి
లింక్ పై క్లిక్ చేసి ఇప్పుడే పొందండి అంటూ గూగుల్ పేరుతో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అయితే అలాంటి మెసేజ్ లు ఓపెన్ చేయోద్దంటూ సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా అకౌంట్ లో ఉన్న నగదు కొట్టేసేందుకు స్క్రాచ్ తో రూ.500 నుంచి 5వేలు పొందండి అంటూ సైబర్ నేరగాళ్లు ఈ తరహా మెసేజ్ లు పెడుతూ బ్యాంక్ ఖాతాదారుల్ని ఊరిస్తుంటున్నారని అంటున్నారు.
సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేస్తే సంబంధిత పర్సనల్ వివరాల్ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. అలా బ్యాంక్ ఖాతాదారులు పర్సనల్ విషయాల్ని షేర్ చేసిన వెంటనే నేరస్తులు మాల్ వేర్ ద్వారా అకౌంట్లలో ఉన్న నగదును మాయం చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంక్ నుంచి కాల్ చేస్తే అకౌంట్ వివరాలు అడగరని, అలా ఎవరు అడిగినా జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు.