
సంగారెడ్డి టౌన్ ,వెలుగు; జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సజావుగా జరగాలని కలెక్టర్వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. గురువారం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజల నుంచి స్వీకరిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ఈనెల 16 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే రెండు రోజులు ప్రజాపాలన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తూ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఎక్కడ దరఖాస్తుల కొరత లేకుండా చూసుకోవాలని, అందరికి అందుబాటులో ఉంచాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు డేటా ఎంట్రీ ఏవిధంగా చేయాలనే దానిపై ఈ నెల5న ఆపరేటర్లకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అడిషనల్ చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ నగేశ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తూప్రాన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆయన తూప్రాన్ మున్సిపల్ పరిధి లో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏవైనా సమస్యలుంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలన్నారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, తహసీల్దార్ విజయలక్ష్మి, కమిషనర్ ఖాజా మొహిజోద్దిన్, వార్డు కౌన్సిలర్ అరుణ, సీఐ శ్రీధర్, ఎస్ఐ శివానందం ఉన్నారు.