- కచ్చితంగా అందుబాటులో ఉంచాలన్న ట్రాయ్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ డేటాను వాడని కస్టమర్ల కోసం ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్ కాల్స్ అందించే స్పెషల్ ప్లాన్లను సపరేట్‌గా ఆఫర్ చేయాలని టెలికం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. ఇందుకు సంబంధించి టారిఫ్ రూల్స్‌ను సవరించింది. స్పెషల్ ప్లాన్ల గరిష్ట కాలపరిమితిని 90 రోజుల నుంచి 365 రోజులకు పొడిగించింది. వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్ చేసే, 365 రోజుల వ్యాలిడిటీ లోపల ఉన్న ఒక్క స్పెషల్ ప్లానునైనా కంపెనీలు అందుబాటులో ఉంచాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొంది.
ALSO READ : New Year Plan : నెట్ఫ్లిక్స్తో BSNL బంపరాఫర్.. జియో, ఎయిర్టెల్కు పోటీగా..
చాలా మంది యూజర్ల ఇండ్లలో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్‌లు ఉన్నాయని, మరికొంత మంది ఇంటర్నెట్‌ను వాడడం లేదని తెలిపింది. టెలికం కంపెనీలు ఏ రేటుతోనైనా రీఛార్జ్ వోచర్లను తీసుకురావొచ్చని, కానీ కనీసం రూ.10 వాల్యూ ఉన్న వోచర్ ఉండాలని, టాప్ అప్ వోచర్లు రూ.10 కి మల్టిపుల్ అయి ఉండాలని తెలిపింది.
అక్టోబర్‌లోనూ తగ్గిన జియో యూజర్లు
ఈ ఏడాది సెప్టెంబర్‌లో 79.7 లక్షల మంది యూజర్లను కోల్పోయిన రిలయన్స్ జియో, ఈ ఏడాది అక్టోబర్‌లో మరో 37.6 లక్షల మందిని కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా కూడా ఈ ఏడాది అక్టోబర్‌లో 19.77 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లను కోల్పోగా, ఎయిర్‌టెల్ మాత్రం 19.28 లక్షల సబ్‌స్క్రయిబర్లను పొందింది. ప్లాన్ల రేట్లను పెంచడంతోనే ఈ కంపెనీలు భారీగా సబ్‌స్క్రయిబర్లను కోల్పోయాయి. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఐదు లక్షల మంది సబ్‌స్క్రయిర్లను సాధించింది.