విశాక ఇండస్ట్రీస్ జేఎండీ వంశీకృష్ణ
ముషీరాబాద్, వెలుగు: స్టూడెంట్లు బాగా చదివితే సమాజంలో గుర్తింపు ఉంటుందని విశాక ఇండస్ట్రీస్ జేంఎడీ వంశీ కృష్ణ అన్నారు. స్టూడెంట్లలో ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా చదువును పక్కన పెట్టొద్దన్నారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థలకు చెందిన ఎంబీఏ కాలేజీలో ఫ్రెషర్స్ డే, స్కూల్ టీచర్లు, పేరెంట్స్ మీట్ జరిగింది. చీఫ్ గెస్టుగా హాజరైన విశాక ఇండస్ట్రీస్ జేఎండీ వంశీకృష్ణ ఫ్రెషర్స్ డే వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో సంతోషంగా ఉండాలంటే రెస్పాన్సిబులిటీ ఉండాలన్నారు. ఎంటర్టైన్మెంట్తో పాటు చదువుపై కూడా ఫోకస్ చేయాలన్నారు. ఎంబీఏ చేసిన వారికి మంచి ఉద్యోగావకాశాలు ఉండటంతో స్టూడెంట్లు ఎక్కువగా ఈ కోర్సు వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నారు. విశాక ఇండస్ట్రీస్ ఇప్పటికే డిఫరెంట్ ప్రోగ్రామ్స్‌తో ముందుకెళ్తోందన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న ఎంబీఏ స్టూడెంట్లకు విశాక ఇండస్ట్రీస్ వెల్కమ్ చెబుతోందన్నారు. అంబేద్కర్ విద్యాసంస్థల స్టూడెంట్లకు కాకా వెంకటస్వామి ఫ్యామిలీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అంబేద్కర్ విద్యాసంస్థల సెక్రటరీ గడ్డం వినోద్ మాట్లాడుతూ.. స్టూడెంట్లకు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను నేర్పిస్తున్నామన్నారు.
ఫ్రెషర్స్ డే వేడుకల్లో భాగంగా స్టూడెంట్ల ర్యాంప్ వాక్
డ్యాన్స్ లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ పీవీ రమణకుమార్, డైరెక్టర్ రామకృష్ణ మోహన్ రావు, ఎంబీఏ కాలేజీ ప్రిన్సిపల్ నాగరాజా, అడ్మిన్ ఆఫీసర్ కిరణ్ కుమార్, స్కూల్ ప్రిన్సిపల్ విఠలా చారి, స్టూడెంట్లు, వారి పేరెంట్స్, టీచింగ్ , నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు.