
షాద్ నగర్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలకు అతీతంగా సముచిత గుర్తింపు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్ నగర్ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. అనంతరం ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటున్నామని, దీనిపై బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు. కార్యక్రమంలో చెంది తిరుపతిరెడ్డి, బాలరాజ్ గౌడ్, చల్లా శ్రీకాంత్ రెడ్డి, కొంకళ్ల చెన్నయ్య, జమ్రుద్ ఖాన్, ముబారక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..