శ్రీరాంపూర్ ఏరియాలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా :జీఎం సూర్యనారాయణ

శ్రీరాంపూర్ ఏరియాలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా :జీఎం సూర్యనారాయణ

 నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియాలో రికార్డు స్థాయిలో డిసెంబర్ నెలలో ఉత్పత్తి, రవాణా జరిగిందని ఏరియా జీఎం సూర్యనారాయణ తెలిపారు. బొగ్గు ఉత్పత్తిపై బుధవారం నిర్వహించిన  ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. డిసెంబర్ నెలలో రికార్డులు సృస్టించామన్నారు. గత నెల 27న ఏరియాలో 28,509 టన్నుల ఉత్పత్తి సాధించామని, కేవలం భూగర్భ గనుల్లో 5,578 టన్నుల ఉత్పత్తి జరిగిందని తెలిపారు. డిసెంబర్ నెలలో  సాధించాల్సిన 5.78 లక్షల టన్నులకు గాను 6.56 లక్షల టన్నులు(114 శాతం) సాధించి రికార్డు బ్రేక్ చేశామన్నారు.

27న 7 రేకుల బొగ్గు రావాణా, నెలలో మొత్తంగా157 రేకులు, 29,215 టన్నుల బొగ్గు సరఫరా చేశామని వెల్లడించారు. వార్షిక లక్ష్యాలు సాధించేందుకు అందిరి సహకారంతో  ముందుకు పోతున్నామన్నారు. సంస్థలో ఆఫీసర్లతో పాటు ప్రతి ఉద్యోగి తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ, డీజీఎంలు అరవిందరావు, చిరంజీవులు, సీనియర్ పీవో కాంతారావు తదితరులు పాల్గొన్నారు.