యాదగిరి నర్సన్నకు రికార్డు స్థాయి ఆదాయం

యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుడికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. స్వామి వారి 20 రోజుల హుండీ ఆదాయం రూ.1,84,84,891గా తేలింది. దీంతో పాటు భక్తులు144 గ్రాముల బంగారం, 2కిలోల 850 గ్రాముల వెండిని స్వామివారికి కానుకగా సమర్పించారు. హుండీలోభారీ మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా ఉంది. 1,024  అమెరికన్ డాలర్లు, 210 యూఏఈ దిర్హామ్స్, 145 ఆస్ట్రేలియన్ డాలర్స్, 20 యూకే పౌండ్స్, 300 కెనడియన్ డాలర్స్, 200 మెక్సికన్ డాలర్లు, 15 సింగపూర్ డాలర్స్, ఒక ఒమనీ బైసాను భక్తులు హుండీలో వేశారు.