తెలంగాణలో డిసెంబర్ నెలలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. 2024 డిసెంబర్ నెలలో మొత్తం 3 వేల 805 కోట్ల మద్యం అమ్ముడైంది. డిసెంబర్ 30న ఒక్కరోజే 402 కోట్ల 62 లక్షల లిక్కర్ సేల్ అవ్వగా.. డిసెంబర్ 31 న 282 కోట్లకు పైగా మద్యం సేల్ అయింది. డిసెంబర్ 26 న 192 కోట్లు, 27న 187 కోట్ల మద్యం అమ్ముడైంది. డిసెంబర్ లాస్ట్ వీక్ లో రెండు ఆదివారాలు, క్రిస్మస్ హాలిడే రోజు తప్ప వారం రోజుల్లో దాదాపు 1700 కోట్ల మద్యం తాగారు. 2023 డిసెంబర్ తో పోలిస్తే 2024 డిసెంబర్ లో దాదాపు 200 కోట్ల మద్యం ఎక్కువగా అమ్ముడుపోయిందని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారుల సమాచారం.
గత వారంలో మద్యం అమ్మకాలు ఇలా..
- 2024 డిసెంబర్ 23న రూ. 193 కోట్లు
- డిసెంబర్ 24న రూ. 197 కోట్లు
- 26న రూ. 192 కోట్లు
- 27న రూ. 187 కోట్లు
- 28న రూ. 191 కోట్లు
- 30న రూ. 402 కోట్లు
- 31న రూ. 282 కోట్లు
ఒక్కరోజే 1184 కేసులు
మరో వైపు హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలల్లో ఒక్కరాత్రికే వెయ్యికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అర్థరాత్రి వరకు దాదాపు 11 వందల 84 మందిపై కేసులు నమోదు చేశారు. అత్యధికంగా ఈస్ట్ జోన్ లో 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్ లో 179, నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులను నమోదు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర డ్రగ్ టెస్ట్ లు నిర్వహించగా.. నాగార్జున రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది.