ఏనుమాముల మార్కెట్​లో పసుపుకు రికార్డు ధర

ఏనుమాముల మార్కెట్​లో పసుపుకు రికార్డు ధర
  • క్వింటాకు రూ.11.010
  • గత ఏడాది ధర రూ. 7వేలే...

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో సోమవారం పసుపుకు రికార్డు ధర పలికింది. హన్మకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన గోల్కొండ సదయ్య అనే రైతు సోమవారం మార్కెట్​లోని సత్యసాయి ట్రేడర్స్​కు 10 బస్తాల పసుపు తీసుకువచ్చాడు. మేలు రకం పసుపు కావడంతో క్వింటాలుకు రూ.11,010 ధర పలికింది. 2013లో క్వింటాల్​ పసుపుకు ఏకంగా 16,000 ధర పలికి రికార్డు సృష్టించింది.

గత ఏడాది ఇదే సీజన్​లో రూ.7‌‌వేలు కూడా దాటలేదు. డిమాండ్​కు అనుగుణంగా పంట ఉత్పత్తి లేకపోవడంతో పసుపుకు అధిక ధర వస్తోందని, వచ్చే రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్​కార్యదర్శి రాహుల్​ తెలిపారు.