- నెల రోజుల్లో పదివేలకు పైగా పెరిగిన ధర
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ మిర్చి రికార్డు ధర పలుకుతోంది. ఇంట్లో వాడకంతో పాటు మామిడి పచ్చళ్ల సీజన్ కావడంతో దేశీ మిర్చీకి గిరాకీ ఎక్కువగా ఉంది. దీంతో మిగతా మిర్చి రకాల కన్నా యూఎస్ 341 (దేశీ మిర్చి)కి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఏప్రిల్ మొదటి వారంలో రూ. 26 వేలు పలికిన క్వింటాళ్ మిర్చి, ప్రస్తుతం రూ. 35 వేలకుపైగా పలుకుతుంది. అలాగే తేజ రకం మిర్చి రూ. 17 వేలకు పైనే పలుకుతోంది. ఇదిలా ఉంటే సింగిల్ పట్టి మిర్చి రకం ధర భారీగా పతనమైంది. ఏప్రిల్ మొదటి వారంలో సింగిల్ పట్టి మిర్చి క్వింటాల్‌కు రూ. 45 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 7 వేల నుంచి 5 వేలే పలుకుతోంది.