టీ20 వరల్డ్ కప్ 2024 లో ఎన్నడూ లేని విధంగా ఐసీసీ తొలిసారి 20 జట్లతో గ్రాండ్ గా నిర్వహించింది. విజయవంతంగా ఈ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. శనివారం (జూన్ 29) భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బార్బడోస్ వేదికగా ఫైనల్ తో ఈ టోర్నీ ముగుస్తుంది. నెలరోజుల పాటు అభిమానులను అలరించిన ఈ మెగా టోర్నీలో గెలిచిన జట్టుకు భారీ నజరానా దక్కనుంది. విజేతకు ఏకంగా రూ. 20 కోట్ల భారీ నజరానా దక్కనుంది. దక్షిణాఫ్రికా, భారత్ లలో ఒక జట్టు వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు ఈ క్యాష్ ను దక్కించుకోనున్నాయి.
ఈ టోర్నీ ప్రైజ్ మనీ మొత్తం అక్షరాలా రూ. 93.51 కోట్ల రూపాయలు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఈ ప్రైజ్ మనీ అత్యధికం. గెలిచిన జట్టుకు రూ. 20.3 కోట్ల రూపాయలు అందుకోనుంది. రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ 10.64 కోట్ల రూపాయలు దక్కనున్నాయి.సెమీ ఫైనల్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లకు రూ. 6. 55 కోట్లు గెలుచుకుంటాయి. సూపర్ 8 దశతో సరిపెట్టుకున్న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, అమెరికా జట్లకు రూ. 3.18 కోట్ల రూపాయలు లభిస్తాయి.
ఇక గ్రూప్ లో మూడో స్థానంలో నిలిచిన జట్లకు రూ. 2.06 కోట్లు.. మిగిలిన జట్లకు రూ. 1.87 కోట్లు లభిస్తాయి. గ్రూప్ దశలో విజయం సాధించిన జట్టుకు రూ. 25.9 లక్షలు ప్రైజ్ మనీ దక్కుతుంది. గత వరల్డ్ కప్ (2022) లో విజేతకు రూ. 12 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. అయితే ఈ సారి దాదాపు రెట్టింపు ప్రైజ్ మనీ లభించనుంది. దీంతో రూ. 20 కోట్ల భారీ నగదును ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.