యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డుస్థాయిలో నిత్యఆదాయం వచ్చినట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు.  ఆదివారం ఒక్కరోజే కోటి 16లక్షల 13వేల 977 రూపాయల  ఆదాయం వచ్చిందని తెలిపారు. గత ఆదివారం కంటే ఈసారి 6లక్షల 31వేల 531 రూపాయల అధిక ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ చరిత్రలో ఇదే రికార్డని వెల్లడించారు. 

కార్తీక మాసం,ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి దర్శనానికి క్యూ కట్టారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి 3 గంటల టైం పట్టింది.