ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సీజన్ జూన్ 31తో ముగిసినందున ఈ ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన ITR సంఖ్యను ఆదాయపు పన్ను శాకి శుక్రవారం అప్డేట్ చేసింది. టాక్స్ పేయర్స్ సకాలంలో పన్ను చెల్లించారు. ఫలితంగా రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం జరిగింది. జూలై 31, 2024 నాటికి AY 2024--25 కోసం దాఖలు చేసిన మొత్తం ITRల సంఖ్య 7.28 కోట్లను దాటింది. ఇది గతేడాదితో పోలిస్తే 7.5 శాతం పెరిగింది. 2023లో ఐటీఆర్ ఫైలింగ్ రూ. 6.77 కోట్లు.
ఈ సీజన్‌లో దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్‌లలో పాత పన్ను విధానంలో 2.01 కోట్లతో పోల్చితే కొత్త పన్ను విధానంలో 5.27 కోట్లు ఉన్నాయి. దాదాపు 72 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. 28 శాతం మంది పాత పన్ను విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అయితే ఐటీఆర్ ఫైలింగ్ చివరి రోజు అంటే జూలై 31,2024న ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 69.92 లక్షల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి.
పీక్ ఫైలింగ్ అవర్‌లో సాయంత్రం 7 గంటల నుంచి 8గంటల మధ్య 5.07 లక్షల ఫైలింగ్స్ జరిగాయి. కొత్తగా 58.57 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరడంతో తొలిసారిగా ఫైల్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది.