లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఆటోమొబైల్ లంబోర్ఘి సంస్థ గత ఏడాది ( 2023) ఏకంగా 10 వేల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. తన చరిత్రలో మొదటి 10వేల 112 యూనిట్లను 2023లో విక్రయించింది. ఇది సంవత్సర వృద్ధిలో 10 శాతం.
యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా(EMEA) ప్రాంతం నుంచి అత్యధికంగా 3వేల 987 కార్లు అమ్ముడుపోగా అమెరికాలో 3వేల 465 యూనిట్లు , ఆసియా పసిఫిక్(APAC) ప్రాంతాల్లో 2వేల 660 కార్లను సేల్ చేసింది లంబోర్ఘి సంస్థ.
EMEA ప్రాంతంలో 2023 అమ్మకాల్లో 14 శాతం వృద్ధి సాధించగా.. అమెరికాలో 9 శాతం, APAC ప్రాంతంలో 4 శాతం పెరిగింది.
అమెరికాలో 3వేల కార్లు డెలివరీ చేసిన అతిపెద్ద మార్కెట్ గా ఉంది. జర్మనిలో 961 కార్లు, చైనా( 845 కార్లు), యూకే(801కార్లు), జపాన్ 660 కార్లు), మిడిల్ ఈస్ట్(496 కార్లు), దక్సిణ కొరియా(434కార్లు), ఇటలీ (409 కార్లు), కెనడా(357 కార్లు), ఆస్ట్రేలియా(263కార్లు), ఫ్రాన్స్ , మొనాకో(255 కార్లు) స్విట్జర్లాండ్(211 కార్లు), తైవాన్ (131కార్లు), ఇండియా (103 కార్లు) అమ్ముడు పోయాయి.
2023లో లంబోర్ఘిని Revuelto, మొదటి V12 హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫైడ్ వెహికల్(HPEV) హైబ్రిడ్ సూపర్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. ఆర్డర్లు ఇప్పటికే 2026 చివరి వరకు ఉత్పత్తిని కవర్ చేస్తున్నారు.
అంతేకాదు లంబోర్ఘిని కంపెనీ లాంజాడార్ కాన్సెప్ట్ కారును కూడా ఆవిష్కరించింది. దీంతోపాటు 2024లో జరిగే FIA వరల్డ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్ షిప్, IMSA వెదర్ టెక్ స్పోర్ట్స్ కార్ ఛాంపియన్ షిప్ లో నడిచే LMDh కేటగిరీ రేసింగ్ కారు లంబోర్ఘిని SC63 ని కూడా ఆవిష్కరించింది.