ఈ ఆరుగురు గెలిస్తే చరిత్రే !

లోక్ సభ బరిలో 22 మంది మహిళలు

రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో స్క్రూట్నీ, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 22 మందిమహిళలు బరిలో నిలిచారు. ఈఎన్నికల్లో 17 స్థా నాల్లో పోటీ చేస్తున్నమొత్తం అభ్యర్థుల సంఖ్య 443 కాగా,వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్యకేవలం 22(4 శాతం) మాత్రమే. ఈసంఖ్య రాజకీయాల్లో వారి ప్రాతినిథ్యలేమికి అద్దం పడుతోంది. 14స్థా నాల్లో మహిళా అభ్యర్థులు పోటీలోఉండగా, మిగతా మూడు స్థా నాల్లోఒక్క మహిళ కూడా లేరు. బరిలోనిలిచినవారిలో ప్రధాన పార్టీలకుచెందిన అభ్యర్థులు ఆరుగురుఉండగా, రిజిష్టర్‌ పార్టీలకుచెందినవారు ఎనిమిది మంది,ఇండిపెం డెంట్లు ఎనిమిది మందిఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్ లోనిజామాబాద్‌ – కల్వకుం ట్లకవిత(టీఆర్‌ఎస్‌), మహబూబాబాద్‌ –మాలోత్‌ కవిత(టీఆర్‌ఎస్‌), మహబూబ్ నగర్‌– డీకే అరుణ(బీజేపీ),నాగర్‌ కర్నూల్‌ – బంగారు శృతి(బీజేపీ), ఖమ్మం – రేణుకాచౌదరి(కాం గ్రెస్‌), నల్లగొండ – మల్లు లక్ష్మి(సీపీఎం) ఉన్నారు. ఆరు నియోజకవర్గా ల్లో పోటీ చేస్తున్న ఈ అరుగురుమహిళా అభ్యర్థుల ఎవరికి ఎవరూపోటీగా లేకపోవడం విశేషం. వీరందరికి అదృష్టం కలిసి వస్తే మన రాష్ట్రంనుం చి ఆరుగురు మహిళా ఎంపీలుపార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశంకూడా ఉంది. ఇదే జరిగితే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఒక రకంగా మన రాష్ట్రం నుం చినెరవేరినట్లు కూడా అవుతుంది.

రెండోసారి పోటీలో నిలిచిన కవిత

సీఎం కేసీఆర్‌ కూతురు,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2009 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. జాగృతి సంస్థ ద్వారా అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్ సభ స్థానం నుంచి అప్పటి సిట్టింగ్‌ ఎంపీ మధుయాష్కిగౌడ్ 2 లక్షల పై చిలుకు మెజార్టీతో గెలిచారు. టీఆర్‌ఎస్ లోముఖ్య నేతగా వ్యవహరిస్తున్న ఆమె రెండోసారి నిజామాబాద్‌ లోక్ సభ స్థానం నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లోభారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఈసారి పసుపు రైతుల నిరసన కవితకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే నియోజవకర్గం నుంచి వై. రజిత అనే ఇండిపెండెంట్‌ అభ్యర్థిని పోటీలోఉన్నారు.

ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఎంపీగా బరిలోకి

డోర్నకల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్‌ రెడ్యా నాయక్‌ కూతురైన మాలోత్‌ కవిత మహబూబాబాద్‌ లోక్ సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో కాం గ్రెస్‌ పార్టీ నుంచి మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె 2014 ఎన్నికల్లో మళ్లీ కాం గ్రెస్‌ నుంచే పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌ నాయక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తన తండ్రి రెడ్యానాయక్ తో కలిసి టీఆర్‌ఎస్ లోచేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మహబూబాబాద్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినప్పటికీ పార్టీ అధిష్టానం ఇవ్వలేదు. అనూహ్యంగా ఇప్పుడు మహబూబాబాద్‌ లోక్ సభ టికెట్‌ రావడంతో బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్ తో పోటీపడుతున్నారు. కవితతోపాటు ఇదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థినులు ఊకె కౌసల్య, పాల్వంచ దుర్గ కూడా పోటీలో ఉన్నారు.

పాలమూరు నుంచి డీకే అరుణ

గద్వాల జేజమ్మ డీకే అరుణ రాజకీయ జీవితం టీడీపీతో మొదలైంది. 1996లో మహబూబ్ నగర్ లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా, 1998లోఅదే స్థానంలో కాం గ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి మళ్లీ పరాజయం పాలయ్యారు. 2004లో కాం గ్రెస్ టికెట్‌ లభించకపోవడంతో కాం గ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యేగా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో కాం గ్రెస్ తరఫునపోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొంది  వైఎస్‌ కేబినేట్‌లో చిన్నతరహా పరిశ్రమలు,చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశారు. తర్వాత 2014 ఎన్నికల్లో కాం గ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన అరుణ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక బీజేపీలో చేరారు.రెండు దశాబ్దాల క్రితం తనకు కలిసిరాని లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి

కాం గ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి రాజకీయ జీవితం 1984లో టీడీపీతో మొదలైంది. బెంగళూరులోని కర్ణాటక యూనివర్సి టీ నుంచి ఆమె ఇండస్ట్రియల్‌ సైకాలజీలో పీజీ పూర్తి చేశారు. 1986 నుంచి 1998 వరకు రెండు సార్లు రాజ్య సభ సభ్యురాలుగా పని చేశారు. హెచ్ డీ దేవేగౌడ ప్రభుత్వం లో ఆమె కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో కాం గ్రెస్‌ పార్టీలో చేరాక 1999, 2004 లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీగా గెలుపొందారు. 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ –1 ప్రభుత్వం లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, 2006 నుంచి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లోఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. మళ్లీ తన పాత ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామానాగేశ్వర్‌రావుకు గట్టి పోటీ ఇస్తున్నారు.

తల్లిదండ్రుల బాటలో శృతి

నాగర్ కర్నూల్‌ బీజేపీ అభ్యర్థిబంగారు శృతి కుటుంబానికి ఆ పార్టీతో విడదీయరాని బంధం ఉంది. ఆమె తల్లిదండ్రులు బంగారు సుశీల, లక్ష్మణ్‌ ఆ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగారు. తండ్రి బంగారు లక్ష్మణ్‌ బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర కేబినేట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆమె తల్లి సుశీల 2004 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని జాలోర్‌ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. లక్ష్మణ్‌, సుశీల దంపతుల సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం వారి కూతురు శృతికి నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో శృతి పోటీ చేయడం ఇదేతొలిసారి. నాగర్‌ కర్నూల్‌ కాం గ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.రాములుతో ఆమె పోటీ పడుతున్నారు. ఇదే స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి బాకీ రేణుక పోటీలోఉన్నారు.

మల్లు స్వరాజ్యం వారసత్వంతో లక్ష్మీ

ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండి ఆపార్టీలకు ఎంపీలను అందించిన నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా మల్లు లక్ష్మీ పోటీచేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైన తన అత్త మల్లు స్వరాజ్యం ఉద్యమ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఆమె 1992 నుంచి సీపీఎం అనుబంధ మహిళా సంఘం ఐద్వాలో పనిచేస్తున్నారు. మహిళల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించారు. సూర్యాపేట మండలం రాయినిగూడెం సర్పంచ్ గా కూడా పనిచేశారు. ఐద్వాలో నల్లగొండ జిల్లాకార్యదర్శిగా, ఆలిండియా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.నల్లగొండ లోక్ సభ బరిలో నిలిచిన ఆమె టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్ డి, కాం గ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్ కుమార్‌ రెడ్డికి ధీటుగా ప్రచారం చేస్తున్నారు. సీపీఐ, బీఎల్‌ఎఫ్‌ కూడా ఆమెకు మద్దతుగా నిలిచాయి.

వీరితోపాటు ఆదిలాబాద్‌– కుమ్రం వందన(నవ ప్రజారాజ్యం పార్టీ), పెద్దపల్లి – ఇరుగురాల భాగ్యలక్ష్మి(పిరమిడ్‌ పార్టీ), గొడిశాల నాగమణి(ఇండిపెండెంట్‌), కరీంనగర్‌ – అయిలా ప్రసన్న(యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ), జహీరాబాద్‌ – ననగనూరి లత(ఇండి), మల్కాజిగిరి – బూరు బాలమణి(ఇండియా ప్రజాబంధు పార్టీ), సికింద్రాబాద్‌ – ఎస్‌. సత్యవతి(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), చేవేళ్ల – బెన్నెల జూలీ(నేషనల్‌ ఉమెన్‌ పార్టీ), కేశవభట్ల అనూష(ఇండి), వరంగల్‌– పనిగంటి రజితావాణి(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), బుంగా జ్యోతి రమణ(ఐహ్రా నేషనల్‌ పార్టీ) ఎంపీ అభ్యర్థు లుగా బరిలో నిలిచారు. కాగా హైదరాబాద్‌, భువనగిరి, మెదక్‌ నియోజకవర్గా ల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీలో లేరు.

 యాకయ్య