11 రోజుల్లో ఢిల్లీలో రికార్డు వర్షం

11 రోజుల్లో ఢిల్లీలో రికార్డు వర్షం

న్యూఢిల్లీ: వానాకాలంలో ఏటా ఢిల్లీలో కురిసే వర్షాలలో 80 శాతం వర్షం గడిచిన పదకొండు రోజుల్లోనే కురిసిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఆగస్టు మొత్తమ్మీద నమోదయ్యే సాధారణ వర్షాపాతం 165.2 మి.మి. కాగా ఈ నెలలో ఇప్పటివరకు 147.4 మి.మి. వర్షపాతం రికార్డయిందని తెలిపారు. సీజన్ మొత్తంగా చూస్తే.. సాధారణ వర్షపాతం 441.3 మి.మి. అయితే, జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 466 మి.మి. వర్షపాతం నమోదైందని వివరించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలు గురువారం నీట మునిగాయని, రోడ్లమీద ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని మంత్రి చెప్పారు. వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఢిల్లీ ప్రభుత్వం, అర్బన్, లోకల్ బాడీస్ చర్యలు తీసుకుంటున్నాయని హర్ధీప్ సింగ్ పూరి వివరించారు.

For More News..

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌కు కరోనా

టీచర్లకు చెప్పొస్తలె.. పిల్లలకు సమజైతలె