![యవ్వారం కాకపై ఉందే: గణేష్ మండపాల దగ్గర రికార్డింగ్ డ్యాన్స్‌లు](https://static.v6velugu.com/uploads/2024/09/recording-dance-at-ganesh-mandapam-in-tirupati-andhra-pradesh_BlTVEPeRJQ.jpg)
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు కోలాహాలంగా జరుగుతున్న విషయం విదితమే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఆ పార్వతి పుత్రుడికి భక్తిశ్రద్ధలతో పూజలు అందిస్తున్నారు. అయితే, పొరుగు రాష్ట్రమైన ఏపీలో అందుకు భిన్నంగా వేడుకలు జరగుతున్నాయి. గణేష్ మండపాల దగ్గర రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసి అసభ్యకర నృత్యాలు చేస్తూ యువత ఎంజాయ్ చేస్తున్నారు.
కొందరు యువకులు కలిసి తిరుపతి పట్టణంలోని సప్తగిరి నగర్ ఆటో స్టాండ్ వద్ద వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తిరుపతిలో తమ పేరు మార్మోగేలా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్ తరుపున వచ్చిన మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయించారు. వారితో కలిసి నిర్వాహకులు చిందేశారు. ఆ సన్నివేశాలను కొందరు తమ మొబైల్‌లో బంధించి వాట్సప్ గ్రూఫుల్లో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దేవుడి ముందు ఇలాంటి అసభ్యకర నృత్యాలు చేయించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గణనాథుడి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు#Tirupati #VinayakaChavithi pic.twitter.com/uzWpnjV7Kr
— Govardhan Reddy Dasari (@SportsNewsInd24) September 10, 2024