పవిత్రమైన శ్రీరామనవమి రోజు రికార్డింగ్ డ్యాన్సులు చేయడం వివాదాస్పదంగా మరాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమల గిరి మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు విడి విడిగా రికార్డిండ్ డాన్సులను నిర్వహించాయి. మూడు చోట్ల ఎమ్మెల్సీ వర్గీయలు, రెండు చోట్ల ఎమ్మెల్యే వర్గీయలు... ఒక చోట కాంగ్రెస్ వారితో కలిపి ఆరు చోట్ల రికార్డింగ్ డాన్సులతో హోరేత్తించారు. రికార్డింగ్ డ్యాన్స్ ల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.
పోలీసులకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోయి పండగ పూట రికార్డింగ్ డ్యాన్సులు చేయడమేంటని నిలదీస్తున్నారు. రాజకీయ నాయకుల ఇలా రికార్డింగ్ డ్యాన్స్ లను ప్రోత్సహించడం, అడ్డుకోవాల్సిన పోలీసులు మౌనంగా ఉండటంతో జనం మండిపడుతున్నారు.