- రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు
- సూర్యాపేట, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీలు నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా పది పదకొండు జిల్లాల్లోనే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఏకంగా 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డయ్యాయి. 40కి పైగా మండలాల్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మునగాల (సూర్యాపేట), పమ్మి (ఖమ్మం), నేరెళ్ల (జగిత్యాల)లలో 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మంథని (పెద్దపల్లి)లో 46.7, కామారెడ్డిగూడెం (నల్గొండ)లో 46.6, హాజీపూర్ (మంచిర్యాల)లో 46.6, ముత్తారం (పెద్దపల్లి)లో 46.5, మామిళ్లగూడెం (సూర్యాపేట)లో 46.5, మట్టంపల్లి (సూర్యాపేట)లో 46.5, ఇబ్రహీంపేట (నల్గొండ)లో 46.5 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. 11 జిల్లాల్లో 45 నుంచి 45.9 మధ్య, 4 జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు టెంపరేచర్లు ఇదే స్థాయిలో ఉంటాయని వీక్లీ బులెటిన్‌లో ఐఎండీ హెచ్చరించింది.
46 డిగ్రీలకు పైగా
కరీంనగర్ (వీణవంక) 46.5, మహబూబాబాద్ (కొమ్ములవంచ) 46.4, నారాయణపేట (ఊట్కూరు) 46.4, జయశంకర్ భూపాలపల్లి (చేల్పూరు) 46.3, వరంగల్ (గొర్రెకుంట) 46.3, ములుగు (మల్లూరు) 46.2, జనగామ (జాఫర్‌గఢ్) 46.1, వనపర్తి (కేతేపల్లి) 46.1, హనుమకొండ (కాజీపేట) 46, భద్రాద్రి కొత్తగూడెం (భద్రాచలం) 46, నాగర్‌కర్నూల్ (కల్వకుర్తి) 46, జోగులాంబ గద్వాల (వడ్డేపల్లి) 46 డిగ్రీలు నమోదయ్యాయి.
45 డిగ్రీలకు పైగా రికార్డయిన జిల్లాలు
నిర్మల్ (ఖానాపూర్) 45.8, మహబూబ్‌నగర్ (జడ్చర్ల) 45.7, నిజామాబాద్ (నిజామాబాద్) 45.7, మేడ్చల్ మల్కాజ్గిరి (కీసర) 45.7, కుమ్రంభీం ఆసిఫాబాద్ (ఎల్కపల్లి) 45.5, యాదాద్రి భువనగిరి (వలిగొండ) 45.5, సిద్దిపేట (లకుడారం) 45.5, కామారెడ్డి (రామారెడ్డి) 45.4, వికారాబాద్ (బంట్వారం) 45.4, రాజన్నసిరిసిల్ల (ఇల్లంతకుంట) 45.3, రంగారెడ్డి (మొయినాబాద్) 45.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యాయి.