![చనిపోయిన వ్యక్తికి బూస్టర్ వేశారట!](https://static.v6velugu.com/uploads/2022/02/Records-of-a-booster-dose-being-given-to-a-dead-person-have-become-a-topic-of-discussion-in-Bhadradri-Kottagudem_CsAGhraJSO.jpg)
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ వేసినట్లు రికార్డుల్లో నమోదు కావడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెం పట్టణం న్యూ గొల్లగూడెం ప్రాంతానికి చెందిన కొత్త మల్లారెడ్డి(73) ఈ నెల 11న అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు బుధవారం బూస్టర్ డోస్ వేసినట్లు మెసేజ్ రావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఓవర్ లుక్ వల్ల చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ వేసినట్లుగా రికార్డులో నమోదైందని హెల్త్ ఆఫీసర్ పేర్కొన్నారు.