
ఎల్లారెడ్డిపేట, వెలుగు: బీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేసిన ఎకరం భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు రికవరీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శివారులోని 199 సర్వే నంబర్ లో తన పేరిట 8 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు.
పక్కన ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో.. తహసీల్దార్ రాంచంద్రం, ఆర్ఐ, సర్వేయర్ తో కలసి రెండు రోజుల కింద సర్వే చేసి చెరువుకు సంబంధించిన ఎకరం భూమి ఆక్రమణకు గురైనట్లు తేల్చారు. వెంటనే జేసీబీతో కందకం తవ్వి హద్దులు పెట్టారు.
ఇదిలాఉంటే తన భార్య హైమావతి పేరుపై వెంకటాపూర్ గ్రామ శివారులో 3 ఎకరాల 20 గుంటల భూమి పొందగా, 3 నెలల కింద రికవరీ చేసిన విషయం తెలిసిందే.