సైబర్ నేరగాళ్ల నుంచి రూ.50 లక్షలు రికవరీ

సైబర్ నేరగాళ్ల నుంచి రూ.50 లక్షలు రికవరీ
  •   బాధితులుకు అందజేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

బషీర్ బాగ్,వెలుగు: ఫెడెక్స్‌‌‌‌‌‌‌‌ కొరియర్ పేరుతో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తరలిస్తున్నారంటూ 74 ఏళ్ల రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగిని మోసగించిన సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల నుంచి డబ్బును రికవరీ చేశారు.  గతంలో బాధితుడు సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు కంప్లయింట్ చేయగా..  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బాధితుడు మోసపోయిన రూ. 50.20 లక్షలను ఫ్రీజ్‌‌‌‌‌‌‌‌ చేసి రికవరీ చేశారు. 

బుధవారం బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌ సీసీఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో హైదరాబాద్  సిటీ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌ డీసీపీ డి.కవిత, ఏసీపీ చాంద్‌‌‌‌‌‌‌‌ బాషా,ఇన్ స్పెక్టర్ ప్రమోద్‌‌‌‌‌‌‌‌ బాధితుడికి రికవరీ డబ్బు చెక్కును అందజేశారు. సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపోయిన బాధితులు గోల్డెన్‌‌‌‌‌‌‌‌ అవర్‌‌‌‌‌‌‌‌లో 1930కి కాల్‌‌‌‌‌‌‌‌ చేసి, లేదంటే  సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌ వెబ్ సైట్‌‌‌‌‌‌‌‌లో కంప్లయింట్ చేయాలని డీసీపీ సూచించారు.