గోల్డెన్‌‌ అవర్‌‌లో రూ.97 వేలు రికవరీ

గోల్డెన్‌‌ అవర్‌‌లో రూ.97 వేలు రికవరీ

బషీర్ బాగ్,- వెలుగు: సైబర్‌‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు గోల్డెన్‌‌ అవర్‌‌లో స్పందించి ఫిర్యాదు చేస్తే... డబ్బు తిరిగి వచ్చే చాన్స్ ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపారు. సిటీకి చెందిన ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఈనెల11న మర్చంట్‌‌ లోకాన్‌‌ సొల్యూషన్‌‌ అనే హౌసింగ్‌‌.కామ్‌‌ కంపెనీ పేరుతో సైబర్‌‌ మోసానికి గురైంది.

వెంటనే ఆమె సైబర్‌‌ క్రైమ్‌‌ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కానిస్టేబుల్‌‌ బి.సందీప్‌‌ చాకచక్యంగా వ్యవహరించి బాధిత మహిళ మోసపోయిన కంపెనీకి ఆన్‌‌లైన్‌‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం సదురు కంపెనీకి నోటీసులు పంపి, బ్యాంక్‌‌ ఖాతాను ఫ్రీజ్‌‌ చేశాడు. దీంతో గురువారం కంపెనీ ప్రతినిధులు బాధిత మహిళకు రూ. 97,312 నగదును ఎలాంటి కోర్టు ఆర్డర్‌‌ లేకుండానే తిరిగి చెల్లించారు.