హైదరాబాద్ సిటీలో చోరీకి గురైన మొబైల్స్ రికవరీ చేయడంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రికార్డు సృష్టించారు. కేవలం ఒక నెలల్లో కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను రికవరీ చేశారు. దాదాపు 50 మంది సైబర్ క్రైం పోలీసులు శ్రమించి చోరీకి గురైన సెల్ ఫోన్లు , పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేశారు.
సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా సెల్ ఫోన్లు చోరీ, మిస్సింగ్ అయిన సెల్ ఫోన్లను కనిపెట్టి రికవరీ చేశారు. ఒక నెలలో రూ. 2కోట్ల విలువైన 800 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం (అక్టోబర్ 23) న ప్రెస్ మీట్ పెట్టి వాటిని ప్రదర్శించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ నర్సింహారెడ్డి. అనంతరం పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ యజమానులకు అప్పగించారు.
ALSO READ | టెక్నాలజీ : వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. ఒకసారి ట్రై చేయండి
సైబర్ క్రైం డీసీసీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. రోజురోజుకు సైబర్ క్రైం లు పెరిగిపోతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్ చోరీలు జరుగుతున్నాయి. సెల్ ఫోన్లను దొంగి లించి తక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆన్ లైన్ పేమెంట్లు చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసుల డ్రెస్ వేసుకొని మోసాలకు పాల్పడుతున్న నకిలీల పట్ల ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని కోరారు.