
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్), రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన 39 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ట్రేడులు : ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెకానిక్- హెవీ వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్.
అర్హత : మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఐటీఐలో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 55శాతం మార్కులు సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ (ట్రేడ్) టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.rfcl.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.