ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ వణికిపోతోంది. కేరళలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తున్నాయి. నార్తర్న్ మలబార్ జిల్లాలోని కొండ ప్రాంతం లో వరదలతో ఇండ్లు నీటమునిగాయి. ఈశాన్య కేరళలోని వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్ ప్రాంతాల్లో గ్రామాలు నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్ప డింది. భారీచెట్లు కూలిపోయాయి. అక్కడక్కడ కొండచరియలు విరిగి పడ్డాయి. వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కేరళ రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
భారీ వర్షాలతో కేరళ ప్రభుత్వం జూలై 19న విద్యాసంస్థలన్నింటికి సెలవు ప్రకటించింది. వర్షా ప్రభావం ఎక్కువగా ఉన్న మలప్పురం, ఇడుక్కి జిల్లాలోని అరికోడ్, కొండోట్టిలో సెలవులు ప్రకటించారు. భారీవర్షాల కారణంగా పాఠశాల బస్సు కాలువలోకి బోల్తాపడింది. అయితే విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అందరూ క్షేమంగా ఉన్నారు.
పాలక్కాడ్ జిల్లాలో వర్షాల కారణంగా 13 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. 242 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం జరిగి నట్లు అధికారులు చెబుతున్నారు.
కర్ణాటకలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్
జూలై 20 తర్వాత మధ్య, ఉత్తర బంగాళాఖాతం అల్పపీడన ప్రాంత ప్రభావంతో కర్ణాటకలోని కోస్తా , దక్షిణ భాగంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ , దక్షిణ ఇంటీరియర్ కర్ణాటలో జూలై 19న, 20 తేదీలలో భారీ నుంచి అతిభారీ వర్షాలున్నాయని.. రెడ్ అలర్ట్ చేసింది ఐఎండీ.
మరోవైపు కోస్తా, పశ్చిమ ఘాట్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గత రెండు రోజులుగా ఈ ప్రాంతాల్లో విస్తరాంగా వర్షాలు కురుస్తుండటంతో కోస్తా, పశ్చిమ కనుమల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.