హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజులు అంటే.. 2024 ఆగస్ట్ 30, 31 తేదీల్లో భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది. సెప్టెంబర్ 2వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతుతాయని.. అయితే శుక్ర, శనివారాలు మాత్రం అతి భారీ వర్షాలు పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయని అలర్ట్ ఇచ్చింది.తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల శుక్ర, శనివారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
Also Read:-దుర్గం చెరువు FTLలో నా ఇల్లు ఉంటే.. ఎలాంటి చర్యలకైనా సిద్ధం
ఆదివారం నాటికి తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈరోజు ( ఆగస్టు 29, 2024 ) కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఆ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అతి భారీ వర్షాలు శుక్రవారంతో మొదలై సెప్టెంబర్ 2 వరకు కొనసాగవచ్చుని తెలిపింది.హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 450 మిల్లీమీటర్లకు కాగా, ఇప్పటికే 511.5 మిల్లీమీటర్లు నమోదైందని, ఇది 14 శాతం అధికంగా నమోదైనట్లు తెలిపింది.