తెలంగాణలో భారీ వర్షాలు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

తెలంగాణలో భారీ వర్షాలు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, ములుగు జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించిన వెదర్ డిపార్ట్మెంట్. మహబూబాబాద్, ములుగు జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. GWMC ప్రధాన కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.  వరద ముంపు, వర్షపు నీళ్ల ఆగడం తదితర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. 

భారీ వర్షాల నేపథ్యంలో టోల్ ఫ్రీ నంబరు 1800 425 1980, సెల్ నంబరు 97019 99645 సంప్రదించాలని కోరిన GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు.  ప్రజారోగ్యం, డీఆర్ఎఫ్ టీం అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 

మరోవైపు ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బ్యారేజ్ కు ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇరిగేషన్ అధికారులు  మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న  ముళ్లకట్ట , రామ్మన్నగూడెం , మంగపేట పుష్కర్ ఘాట్ లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.