ప్రైవేట్ దందా.. మిర్చీ అమ్ముకోవాలంటే లంచం ఇవ్వాల్సిందే..?

ప్రైవేట్ దందా.. మిర్చీ అమ్ముకోవాలంటే లంచం ఇవ్వాల్సిందే..?

మహబూబాబాద్ జిల్లా  వ్యవసాయ మిర్చి మార్కెట్ లో ప్రైవేట్ వ్యాపారస్తులు దందా కొనసాగిస్తున్నారు. రూ.1500 ఇస్తేనే  మిర్చి కొనుగోలు కూపన్  ఇస్తాం అంటూ రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు. రైతుల దగ్గర నుంచి  రూ. 500 నుంచి 1500 వరకు తీసుకుంటున్నారు. మాల్యాల గ్రామానికి చెందిన మిర్చి రైతు దగ్గర నుంచి ఓ ప్రైవేట్ గుమస్తా  రూ.500లంచం తీసుకున్నాడు. దీనిపై మార్కెట్ యార్డ్  ఆధికారలుకు చెప్పినా అధికారులు,పాలకవర్గం పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. 

లంచం ఇవ్వలేక మిర్చీ అమ్ముకోలేక రైతులు  మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు.  రైతులు దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్న వారి పై చర్యలు తీసుకొవాలని రైతులు, పలు  సంఘాల నాయకులను డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా  కలెక్టర్  జోక్యం చేసుకోవాలని మిర్చి రైతులు  వేడుకుంటున్నారు. మిర్చి రైతులు దగ్గర ఎవరైన డబ్బుల తీసుకుంటే వారి పై చర్యలు తీసుకుంటామని  మార్కెట్ చైర్మన్ ఇస్తావత్ సుధాకర్ నాయక్ హెచ్చరించారు.