పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందారేమో తెలీదు కానీ.. ఏకంగా తిరుమల కొండపైనే ఎర్రచందనం స్మగ్లింగ్ కి పాల్పడ్డారు దుండగులు. తిరుమలలో భక్తుల ముసుగులో కారులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న దుండగులను మాటు వేసి పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
తిరుమలలోని శిలాతోరణం వద్ద ఓ కారు హల్చల్ చేసింది. వేగంగా వెళ్తున్న కారులో అక్రమంగా ఎర్రచందనం రవాణా అవుతున్నట్లు సమాచారం అందటంతో కారు ఆపి తనిఖీలు చేపట్టారు టీటీడీ విజిలెన్స్ అధికారులు.
తిరుమలలో పుష్ప రేంజ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్.. pic.twitter.com/kfofxEfcZK
— DJ MANI VELALA (@MaNi_ChiNna_) January 2, 2025
కారులోని వెనుక సీటులో గ్రేడ్ ఏ కు చెందిన ఎర్రచందనం దుంగలు లభ్యమైనట్లు తెలిపారు అధికారులు. తనికీ చేస్తున్న సమయంలో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. అది గమనించిన సిబ్బంది అతనని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఎర్రచందనం దుంగలతో పాటు కారును సైతం సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.