రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్

  • పోలీసులపైకి రాళ్లు.. గొడ్డళ్లు విసిరి పారిపోయే యత్నం

అమరావతి: నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు 'పుష్ప' సినిమా సీన్ ను తలపించేలా రెచ్చిపోయారు. తమను అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లు విసరడంతోపాటు వాహనాలను దూకించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేయగా రెండు వాహనాల్లో చెన్నై జాతీయ రహదారిలో ఎర్రచందనం తరలిస్తున్నట్ల గుర్తించారు. అయితే వీరిని చిల్లకూరు మండలం బూదనం గ్రామం వద్ద నిలిపేందుకు ప్రయత్నించగా... స్మగ్లర్లు తమ వాహనాలను పోలీసులపై ఎక్కించేందుకు ప్రయత్నించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 45 ఎర్ర చందనం దుంగలు, 24 గొడ్డళ్లు, 31 సెల్ ఫోన్లు, 3 బరిసెలు, ఓ లారీ,  కారుతో పాటు, 75 వేల 230 రూపాయలన నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

ఇవి కూడా చదవండి

మెడికల్ షాపుల్లోకంటే.. ఆన్ లైన్ లో తక్కువ ధరకే మెడిసిన్​

విరాట్ కోహ్లీ పెళ్లిపై షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

హిందూత్వను వదులుకోలే.. బీజేపీతో దోస్తీ వద్దనుకున్నం