ములుగు, వెలుగు : ట్రైబల్ యూనివర్సిటీ పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి విమర్శించారు. ములుగులో బుధవారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ లీడర్లు ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ వల్లే యూనివర్సిటీ నాలుగేళ్లు ఆలస్యం అయిందన్నారు. యూనివర్సిటీకి వనదేవతల పేరు పెట్టి ప్రజల మనోభావాలతో రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. యూనివర్సిటీ ఏర్పాటులో ఆలస్యం చేసినందున గిరిజన బిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జడ్పీ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, ఓడీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, తాడ్వాయి ఎంపీపీ వాణిశ్రీ, సోషల్ మీడియా ఇన్‌చార్జి శీలం మధు పాల్గొన్నారు.