బోరబండ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి

బోరబండ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల డిమాండ్ 
  • విజయవాడ హై వే పై బైఠాయించి ఆందోళన

ఎల్ బీనగర్,వెలుగు: కూకట్ పల్లి బార్ అసోసియేషన్ మెంబర్, న్యాయవాది సంతోష్ పై దాడి చేసిన బోరబండ పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదులు డిమాండ్ చేశారు. సోమవారం కోర్టుల ముందు విజయవాడ హై వే పై  బైఠాయించిన ధర్నా చేపట్టారు. తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వై.కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసుల దాడులు అధికమయ్యాయని, కేసుల విచారణలో సహకరించడం లేదని మండిపడ్డారు. న్యాయవాదులు శాంతియుతంగా వ్యవహరిస్తున్నా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. న్యాయవాదుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. న్యాయవాదులు శ్రీనాధ్, కృష్ణా నర్సింగోజు, నరేశ్ కుమార్, ప్రదీప్, బాల్ రెడ్డి పాల్గొన్నారు.