రెడ్లకు తీన్మార్​మల్లన్న సారీ చెప్పాలి: రెడ్డి జాగృతి సంఘం డిమాండ్

రెడ్లకు తీన్మార్​మల్లన్న సారీ చెప్పాలి: రెడ్డి జాగృతి సంఘం డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: రెడ్డి సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్​మల్లన్న) అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే భేషరుతుగా తమ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని రెడ్డి జాగృతి  వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి డిమాండ్​చేశారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్‏లో మీడియాతో మాట్లాడారు. 

తీన్మార్​మల్లన్న క్షమాపణ చెప్పకపోతే వెంటనే కాంగ్రెస్​పార్టీ నుంచి సస్పెండ్​చేయాలని కోరారు. ఇప్పటికే ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‎ను కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. గాంధీ భవన్​వద్ద నిరసన తెలిపామన్నారు. తీన్మార్​మల్లన్న వ్యాఖ్యలను నిరసిస్తూ మార్చి 11న ట్యాంక్​బండ్‎పై రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ‘రెడ్డి మార్చ్’​ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.