తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలి

తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలి

సిద్దిపట రూరల్, వెలుగు: రెడ్డి వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం నాయకులు కోరారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 

రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు బాపురెడ్డి, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు ఎం.బుచ్చిరెడ్డి, సదాశివరెడ్డి, జి.అంజిరెడ్డి, ఐ.అంజిరెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.